Nov 29, 2007

చెంచులక్ష్మి

గాత్రం:ఘంటసాల,జిక్కి
సాహిత్యం:ఆరుద్ర





పల్లవి:

కానగరావా ఓ శ్రీహరి రావా
కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా

చరణం1:

బాస చేసి మరిచావా ఓ చెంచితా
బాస చేసి మరిచావా ఓ చెంచితా
వేచి వేచి కనులేమో కాయలుకాచె
వేచి వేచి కనులేమో కాయలుకాచె
నీవులేక క్షణమైనా నిలువ జాలనే ఏ ఏ ఏ
నీవులేక క్షణమైనా నిలువ జాలనే
జాలమాయె తాళలేను ఏలగరావే నన్నేలగరావే
కానగరావా ఓ చెంచిత రావా

చరణం2:

కంటినీరు చెరువాయే కధలే మారే
కంటినీరు చెరువాయే కధలే మారే
శాంతమొంది నరసింహా చెంతకు రావా
శాంతమొంది నరసింహా చెంతకు రావా
జీవితాన అంతులేని చీకటులాయె
జీవితాన అంతులేని చీకటులాయె
దేవదేవ ఈ వియోగ మెన్ని దినాలో ఇంకెన్ని దినాలో

కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: