గాత్రం: ఘంటసాల,సుశీల
సంగీతం:కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
నిర్మాత: డి.మధుసుధన్ రావు
దర్శకత్వం:ఆదుర్తి సుబ్బా రావు
విడుదల:1972
పల్లవి:
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మనజీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశలవెలిగించు దీపాల వెల్లి
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మనజీవితమే ఒక దీపావళి
చరణం1:
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కని బావతో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు
మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు గుసగుసలు
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మనజీవితమే ఒక దీపావళి
చరణం2:
అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు
మరదళ్ళు చూస్తారు మర్యాద వాళ్ళకు
బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు
బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీసెడు గుద్దులు గుద్దేరు
అహహహహ
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మనజీవితమే ఒక దీపావళి
చరణం3:
అమ్మాయి పుట్టింది అమాసనాడు
అసలైన గజదొంగ అవుతుంది చూడు
పుట్టిన రోజున దొరికాడు తోడు
పుట్టిన రోజున దొరికాడు తోడు
పున్నమినాటికి అవుతాడు తోడు
అహహ అహహహ అహ ఆ ఆ ఆ
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి
మనజీవితమే ఒక దీపావళి
|
2 comments:
నాకు ఆన్నీ బ్లాగుల కంటే
మీ బ్లాగు చాలా ఇష్టం
చక్కగా ఆన్నీ పాటలకు lyrics దొరుకుతాయి.
నాకు తెలిసీ, సరే తెలియకుండా...
మన సినిమా పాటలు lyrics దొరికే బ్లాగు... సైటూ ...
ఇద్దొక్కటే.....
మీకు ఎన్నీ సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే
మీ idea కి జోహారు ...
నేను కామెంటూ రాయకపోయినా ...
మీ బ్లాగు లో ప్రతీ పాటా చదివాను ...
Post a Comment