Nov 26, 2007

బొబ్బిలియుద్ధం

గాత్రం:భానుమతి

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి

చరణం1:

వెన్నెలపూవులు విరిసే వేళ
సన్నని గాలులు దాగే వేళ
వలపులు ఏవో పలికెను నాలో
ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వలపులు ఏవో పలికెను నాలో
తెలుపగ రానిది ఈ హాయి

ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి

చరణం2:

కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనసై నిలిచే
ప్రాయము నీవై పరువము నేనై
ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి

ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి

||

No comments: