గాత్రం:ఘంటసాల, కె.జమూనారాణి
పల్లవి:
మావ మావ మావ మావ మావ మావ
ఏమె ఏమె భామ ఏమె ఏమె భామ
పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదుంటె చుట్టు చుట్టు తిరుగుతారు మరియాద
పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదుంటె చుట్టు చుట్టు తిరుగుతారు మరియాద
తాళి కట్టకుండ ముట్టుకుంటె తప్పుగాదా
మావ మావ మావ మావ మావ మావ
వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువాళ్ళు మీరు కాదా..ఒహొ
చెయ్యి వెయ్యబోతె బెదురుతారు వింత గాదా
ఏమె ఏమె భామ ఏమె ఏమె భామ
చరణం1:
నీవాళ్ళు నావాళ్ళు రాకనే మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే
నీవాళ్ళు నావాళ్ళు రాకనే మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే
సిగ్గు దాచి ఒహొ, సిగ్గు దాచి ఒకరొకరు సిగను పూలు కట్టుకోని టింగు రంగ అంటు తిరగొచ్చును
లోకం తెలుసుకోక మొగవాళ్ళు మెలగొచ్చునా
మావ మావ మావ మావ మావ మావ
చరణం2:
కళ్ళు కళ్ళు కలుసుకొను రాక ముందే అహ కప్పుకున్న సిగ్గు జారి పోకముందే
కళ్ళు కళ్ళు కలుసుకొను రాక ముందే అహ కప్పుకున్న సిగ్గు జారి పోకముందే
మాయజేసి ఒహొ మరులుగొల్పి ఒహొ మాయజేసి మరులుగొల్పి
మాటలోని మాటగల్పి మధురమైన మా మనసు దోచవచ్చునా
నీవు మర్మమెరిగి ఈ మాట అడగవచ్చునా
ఏమె ఏమె భామ ఏమె ఏమె భామ
చరణం3:
పడుచు పిల్ల కంట పడితె వెంట పడుదురు అబ్బొ వలపంత వొలకబోసి ఆశ పెడుదురు
పడుచు పిల్ల కంట పడితె వెంట పడుదురు అబ్బొ వలపంత వొలకబోసి ఆశ పెడుదురు
పువ్వు మీద ఒహొ పువ్వు పువ్వు మీద వాలు పోతు తేనెటీగవంటి మొగవాళ్ళ జిత్తుల్లన్నీ తెలుసులేవయ్య మా పుట్టి ముందు కధలన్ని విన్నవయ్యా
మావ మావ మావ మావ మావ మావ
చరణం4:
కొత్త కొత్త మోజుల్నీ కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు
కొత్త కొత్త మోజుల్నీ కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు
టక్కరోళ్ళు ఉంటారు టక్కర్లు జేస్తుంటారు నీవు చెప్పు మాట కూడ నిజమేనులే దేహం దూరంగా ఉన్నపుడే జోరౌనులే
ఔనే ఔనే భామ ఔనే ఔనే భామ
చరణం5:
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆశపడక కొంత కాలమాగుదామయా
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆశపడక కొంత కాలమాగుదామయా
పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికి అడ్డు లేదయ్యా
మావ మావ మావ మావ మావ మావ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment