Nov 16, 2007

మల్లీశ్వరి

గాత్రం:ఘంటసాల,భానుమతి


పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
హెయ్ పరుగులు తియ్యాలి ఓ గిత్తలు ఉరకలు వెయ్యాలి
హెయ్ పరుగులు తియ్యాలి ఓ గిత్తలు ఉరకలు వెయ్యాలి
హెయ్ బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి
ఓ ఓ హోరుగాలి కారుమబ్బులు
హోరుగాలి కారుమబ్బులు ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి
మన ఊరు చేరాలి

చరణం1:

గలగల గలగల కొమ్ముల గజ్జెలు , గణగణ గణగణ మెళ్ళో గంటలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గలగల గలగల కొమ్ముల గజ్జెలు , గణగణ గణగణ మెళ్ళో గంటలు
వాగులు దాటి వంకలు దాటి ఊరు చేరాలి
మన ఊరు చేరాలి

చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో
అవిగో అవిగో
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పచ్చని తోటలు మెచ్చిన పువ్వులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో అవిగో ఓ
కొమ్మల ఊగె కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో
అవిగో అవిగో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

||

No comments: