గాత్రం:బాలు,జానకి
సంగీతం:ఇళయరాజా
నిర్మాతలు:రవికిషోర్,శారదాదేవి
దర్శకత్వం:వంశీ
సంస్థ:స్రవంతి ఆర్ట్ మూవీస్
విడుదల:1988
పల్లవి:
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
గానం ఇది నీ ధ్యానం ఇది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
చరణం1:
ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసెది ఎపుడమ్మ
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం
నింగీ నేల కూడె వేల నీకు నాకు దూరాలేల
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
చరణం2:
చైత్రాన కూసేను కోయిలమ్మ గ్రీష్మానికా పాట ఎందుకమ్మ
రేయంతా నవ్వేను వెన్నెలమ్మ నీరెండకానవ్వు దేనికమ్మ
రాగల తీగల్లొ వీణా నాదం కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తార తీరం అంతేలేని ఎంతో దూరం
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
కూడనిది జతకూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
|
No comments:
Post a Comment