Dec 26, 2007

పడమటి సంధ్యారాగం

గాత్రం:జానకి


పల్లవి:

ముద్దుగారే యశోద ముంగిట ముత్యమువీడు
ముద్దుగారే యశోద ముంగిట ముత్యమువీడు
ముద్దుగారే యశోద ముంగిట ముత్యమువీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు
ముద్దుగారే యశోద ముంగిట ముత్యమువీడు

చరణం1:

అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
చెంతల మాలొనున్న చిన్ని కృష్ణుడు
చెంతల మాలొనున్న చిన్ని కృష్ణుడు

ముద్దుగారే యశోద ముంగిట ముత్యమువీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు

చరణం 2:

కాలింగుని తలలపై గప్పిన పుష్యరాగము
కాలింగుని తలలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము
ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె తిరిగే ఫద్మనాభుడు
బాలునీవలె తిరిగే ఫద్మనాభుడు

ముద్దుగారే యశోద ముంగిట ముత్యమువీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు
ముద్దుగారే యశోద ముంగిట ముత్యమువీడు

----------------------------------------------------------------

పాట ఇక్కడ వినండి.

---------------------------------------------------------------

No comments: