సాహిత్యం:వడ్డాది
పల్లవి:
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు

అన్నా అన్నా విన్నావా
చరణం1:
కాళిమడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు
కాళిమడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు
చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు
చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా విన్నావా
చరణం2:
గోకులమందున గోవిందునితో గోపికనై విహరిస్తాను

ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళి వింటాను
ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళి వింటాను
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా విన్నావా
చరణం3:
బృందావనిలో నందకిశోరుని చెంతను నాట్యము చేస్తాను

యమునా తీర విహారంలో హాయిగ పరవశమౌతాను
యమునా తీర విహారంలో హాయిగ పరవశమౌతాను
అన్నా అన్నా విన్నావా చిన్నికృష్ణుడు వచ్చాడు
చిన్నికృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు
అన్నా అన్నా విన్నావా
|
2 comments:
విహారి గారు ! చాలా బాగుందండి పాట. నేను ఇదే వినడం.
thanks for posting such a nice song :)
పాత తెలుగు పాటల కోసం ఒక్క మీ బ్లాగ్ చూస్తే చాలు..ఇంకెక్కడికీ వెళ్ళక్కర్లేదు. :)
by the way మీ ఆణిముత్యాల లింకు బృందావని బ్లాగ్ లో పెట్టుకుంటున్నాను. అభ్యంతరం ఏమైనా వుంటే తెలియపరచండి.
(ఇది ఎప్పటినుండో అడగాలి అనుకుంటున్న విషయం...అశ్రద్ద చేశాను ఇన్నాళ్ళు)
Thanks andi.
Post a Comment