Feb 22, 2008

ఆకలిరాజ్యం

తారాగణం:కమల్‌హాసన్,శ్రీదేవి,ప్రతాప్ పోతన్
గాత్రం:బాలు
సాహిత్యం:ఆత్రేయ
సంగీతం:ఎం.ఎస్.విశ్వనాథన్
దర్శకత్వం:కె.బాలచందర్
సంస్థ:ప్రేమాలయ
విడుదల:1981

పల్లవి:

సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

చరణం1:

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా ఆ ఆ
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా ఆ ఆ
డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేతపుచ్చుకొని డిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్

సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

చరణం2:

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టటం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టటం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్ప
ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్ప
గంగలో మునకేసి కాషాయం కట్టేయి బ్రదర్

సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

చరణం3:

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతానలక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా ఓ ఓ
చదవెయ్య చీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కేలేదు
దేవుడిదే భారమని తెంపుచేయరా బ్రదర్

సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

-------------------------------------------------

పాట ఇక్కడ వినండి.

-------------------------------------------------

No comments: