Feb 29, 2008

చిన్నారి స్నేహం

తారాగణం:రఘు,చంద్రమోహన్,దగ్గుపాటి రాజా, సీత,మాలాశ్రీ ,స్వప్న
సంగీతం: చక్రవర్తి
గాత్రం:బాలు,సుశీల,శైలజ,రమేష్
దర్శకత్వం:ముత్యాల సుబ్బయ్య
విడుదల:1989


పల్లవి:

లా లలలా లా లలలా లా లలలా లాలా
లా లలలా లా లలలా లా లలలా లలలలా
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో
మరుజన్మకైనా కలుసుకో
ఏనాటికేమౌతునా ఏ గూడు నీదౌతున్నా
హాయిగానే సాగిపో
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో

చరణం1:

జీవితం నీకోసం స్వాగతం పలికింది
ఆశలే వెలిగించి హారతులు ఇచ్చింది
ఆకాశమంత ఆలయం నీకోసం కట్టుకుంది
కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుకుంది
స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది
కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది
మాసిపోని గాయమల్లే గుండెలోనే వుంటుంది

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో

చరణం2:

లా లలలా లా లలలా లా లలలా లాలా
లా లలలా లా లలలా లా లలలా లలలలా
ఆశయం కావాలి ఆశలే తీరాలి
మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి
అందాల జీవితానికో అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో
లోకం చీకటౌతున్నా బ్రతుకే భారమౌతున్నా
మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో
మరుజన్మకైనా కలుసుకో
ఏనాటికేమౌతునా ఏ గూడు నీదౌతున్నా
హాయిగానే ఆడుకో
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో

||

No comments: