Mar 31, 2008

రుద్రవీణ

గాత్రం:జేసుదాసు,చిత్ర


పల్లవి:

లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది ఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అమృత కలశముగా ప్రతినిమిషం
అమృత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినది

చరణం1:

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంధ్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను

లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది ఆ ఆ ఆ
ఉదయ రవికిరణం మెరిసినది

చరణం2:

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి

ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ ఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది ఆ ఆ ఆ
లలిత ప్రియ కమలం విరిసినది

||

No comments: