Apr 20, 2008

నాయకుడు

గాత్రం:జిక్కి,సుశీల



పల్లవి:

నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే
అతి మధురం నా మనసే
నా నవ్వే ...నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి

చరణం1:

కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై వున్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై వున్నదిరా
అందాలన్ని పూసెను నేడే
ఆశల కోట వెలిసెను నేడే
దేహం నాది దాహం నీది
కొసరే రేయి నాదే నీది
ఆడి పాడి నువ్వే రా

నా నవ్వే ...నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే
అతి మధురం నా మనసే
నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి

చరణం2:

కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కధలు పలికెను గీతికలే
కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కధలు పలికెను గీతికలే
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం
పలికించేను అల్లరి పాఠం
పరువం నాలో రేగే వేళ
వయసే బంధం వేసే వేళ
ఆడి పాడి నువ్వే రా

నా నవ్వే ...నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే
అతి మధురం నా మనసే
నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: