గాత్రం: ఘంటసాల
పల్లవి:
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుషప్రపంచం లేచింది మహిళాలోకం
చరణం1:
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా... ఆ ఆ ఆ ఆ
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా విస్సన్న చెప్పిన వేదం కూడా
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
చరణం2:
పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు
అది యిది యేమని అన్ని రంగముల... ఆ ఆ ఆ ఆ
అది యిది యేమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు,
నిరుద్యోగులను పెంచారు
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
చరణం3:
చట్టసభలలో సీట్ల కోసం భర్తల తోనే పోటీ చేసి
చట్టసభలలో సీట్ల కోసం భర్తల తోనే పోటీ చేసి
ఢిల్లి సభలో పీఠం వేసి...ఆ ఆ ఆ ఆ
ఢిల్లి సభలో పీఠం వేసి లెక్చర్లెన్నో దంచారు,
విడాకు చట్టం తెచ్చారు
లేచింది, నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment