పల్లవి:
బాలనురా మదనా బాలనురా మదనా
విరి పూవులు వేయకురా మదనా
చరణం1:
నిలిచిన చోటనే నిలువగ నీయక అ అ అ అ
వలపులు కురియునురా తీయని తలపులు విరియునురా మదనా
బాలనురా మదనా
విరి పూవులు వేయకురా మదనా బాలనురా మదనా
చరణం2:
చిలుకల వలే గోర్వంకల వలెనో ఓ ఓ ఓ
చిలుకల వలే గోర్వంకల వలెనో
కులుకగ తోటునురా తనువున పులకలు కలుగునురా మదనా
బాలనురా మదనా
విరి పూవులు వేయకురా మదనా బాలనురా మదనా
చరణం3:
చిలిపి కోయిలలు చిత్తములోనే ఏ ఏ
చిలిపి కోయిలలు చిత్తములోనే
కల కల కూయునురా మనసులు కలవర పరచునురా మదనా
బాలనురా మదనా
విరి పూవులు వేయకురా మదనా బాలనురా మదనా
|
No comments:
Post a Comment