Apr 23, 2008

అభినందన

గాత్రం:బాలు,జానకి



పల్లవి:

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో
రంగులలో కలవో ఎద పొంగులలో కళవో
నవ శిల్పానివో రతి రూపానివో
తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

చరణం1:

కాశ్మీర నందన సుందరివో
కాశ్మీర నందన సుందరివో
కైలాశ మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో ఆ ఆ
ఆమని పూచే యామినివో ఆ ఆ ఆ
మరుని బాణమో మధుమాస గానమో
నవపారిమలాల పారిజాత సుమమో

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై రతి రూపాంగినై
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై

చరణం2:

ముంతాజు అందాల అద్దానివో
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో
లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్ర కళను చిత్రచైత్ర రధమో

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై రతి రూపాంగినై
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై
రంగులలో కలనై ఎద పొంగులలో కళనై

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: