తారాగణం: రామరావు,ఎస్వి.రంగారావు,కాంతారావు,సావిత్రి
సాహిత్యం:సముద్రాల
గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:ఘంటసాల
దర్శకత్వం:కామేశ్వరరావు
సంస్థ: మాధవీ ప్రొడక్షన్స్
విడుదల:1965
పల్లవి:
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
హిమగిరి సొగసులు
ఊ ఆపావే పాడు
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించునేవొ ఏవొ ఊహలు
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చరణం1:
యోగులైనా మహాభోగులైనా
మనసుపడే మనోజ్ఞసీమ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ
యోగులైనా మహాభోగులైనా
మనసుపడే మనోజ్ఞసీమ
సురవరులు సరాగాల చెలుల ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ
సురవరులు సరాగాల చెలుల
కలసి సొలసే అనురాగసీమ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చరణం2:
ఈ గిరినే ఊమాదేవి హరుని
సేవించి తరించెనేమో ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ
ఈ గిరినే ఊమాదేవి హరుని
సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ
సుమశరుడు రతీదేవి జేరి
కేళి తేలి లాలించెనేమో
హిమగిరి సొగసులు మురిపించును మనసులు ఆ ఆ ఆ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు ఆ ఆ ఆ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment