May 14, 2008

జగదేకవీరుని కథ

గాత్రం:పి.లీల



పల్లవి:

నను దయగనవా నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాత
ఇక శరణము నీవే మాత
నను దయగనవా నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాత
ఇక శరణము నీవే మాత

చరణం1:

అపశకునంబయనమ్మ సుతుడే ఆపద పాలాయెనో
అపశకునంబయనమ్మ సుతుడే ఆపద పాలాయెనో
ఎటు చూసెదవో ఎటు బ్రోచెదవో తనయుని భారము నీదే
నను దయగనవా నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాత
ఇక శరణము నీవే మాత

చరణం2:

ఆశా దీపం ఆరిపోవునా
చేసిన పూజలు విఫలములౌనా
నీవు ఇలా ఇక రక్షకులెవరే
కావగ రావా కావగ రావా
ఓ మాతా ఓ మాతా ఓ మాతా

||

No comments: