గాత్రం:బాలు
పల్లవి:
ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే
ఎదుటా నీవే ఎదలోన నీవే
చరణం1:
మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
గాయన్నైన మాన నీవు
హృదయాన్నైన వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కానీదు
ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే
ఎదుటా నీవే ఎదలోన నీవే
చరణం2:
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగ
సత్యాలన్ని నరకాలేగ
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నమయ్యెదుంద
ప్రేమకింత బలముందా
ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment