Dec 15, 2008

చిరంజీవులు

తారాగణం:రామారావు,జమున,గుమ్మడి
గాత్రం:పి.లీల
సంగీతం:ఘంటసాల
దర్శకత్వం:వేదాంతం రాఘవయ్య
నిర్మాత:డి.ఎల్.నారాయణ
సంస్థ:వినోదా పిక్చర్స్
విడుదల:1956

పల్లవి:

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింకలేరా మారాము చాలింకలేరా
తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా

చరణం1:

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
తరుణులందరు దది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
దైవరాయ నిదురలేరా

చరణం2:

నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
వెన్న తిందువుగాని రారా

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా,మళ్ళీ పరుండేవు లేరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: