పల్లవి:
ఆరోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఎదో నవ్వని

ఈరోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆరోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్న ఎదో నవ్వని

చరణం1:
ఆరోజు జాబిల్లి పగలే వచ్చింది
ఈరోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆరోజు ఓ చూపు వలలే వేసింది
ఈరోజు మాపుల్లో కలలే పూచింది
కన్నులే వెన్నెలాయె వన్నెలే వెన్నలాయె
ముద్దులా ముచ్చటాయె నిద్దరే పట్టదాయె
ఈరోజే నాకు తెలిసింది ఈ చిత్రాలు చేసింది లవ్వని
మధుపత్రాలు రాసింది లవ్వని
ఆరోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్న ఎదో నవ్వని
ఆరోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఎదో నవ్వని
ఈరోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
చరణం2:
ఆరోజు కలలోన కరిగే నాప్రేమ
ఈరోజు ఇలలోన నిజమే చేద్దామా
ఆరోజు మెరిసింది అందం చిరునామా
ఈరోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే ఎండలే చల్లనాయె
ఆశలే వెల్లువాయే ఊసులే చల్లిపోయే
ఈరోజే నాకు తెలిసింది ఈ రాగాలు రేపింది లవ్వని
అనురాగాలు చూపింది నువ్వని
ఆరోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఎదో నవ్వని
ఈరోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆరోజు నారాజు చిరునవ్వు చూసి అనుకున్న ఎదో నవ్వని
ఈరోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
|
1 comment:
I enjoyed this blog, The author is a very talented blogger, thank you for sharing. Please view my blog and comment! Thanks!
--->Free Internet Speed Test<---
Post a Comment