Dec 23, 2008

ఊరికి మొనగాడు

తారాగణం :కృష్ణ,జయప్రద,రావుగోపాలరావు
గాత్రం:బాలు,సుశీల
సంగీతం:చక్రవర్తి
దర్శకత్వం:కె.రాఘవేంద్రరావు
విడుదల:1981



పల్లవి:

ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
తెల్లచీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో
తెళ్ళార్లు నాపేరు వల్లించుకో...ఎందుకు
ఇదే అసలు రాత్రి , ఇదే అసలు రాత్రి

ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
తెళ్ళార్లు నీపేరు వల్లించుతా...ఎందుకు
ఇదే అసలు రాత్రి , ఇదే అసలు రాత్రి

చరణం1:

కాకిచేత పంపిస్తే కబురందిందా,కళ్ళారా చూడగానే కథ తెలిసిందా
కాకిచేత పంపిస్తే కబురందిందా,కళ్ళారా చూడగానే కథ తెలిసిందా
ఊరుకున్న ఊసుపోని ఊవిళ్ళు,ఓపలేని పిల్లకయ్యో వేవిళ్ళు
ఊరుకున్న ఊసుపోని ఊవిళ్ళు,ఓపలేని పిల్లకయ్యో వేవిళ్ళు
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
ఆదిలోనే బారసాల చేసుకో సీమంతం
ఊఊలల హాయి ఊఊలల హాయి

ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు
తెల్లచీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో
తెళ్ళార్లు నాపేరు వల్లించుకో...ఎందుకు
ఇదే అసలు రాత్రి , ఇదే అసలు రాత్రి

చరణం2:

సూదికోసం సోదికెళితే సుడి తిరిగిందా
మొహమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా
సూదికోసం సోదికెళితే సుడి తిరిగిందా
మొహమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా
కట్టవయ్య నట్టింట ఉయ్యాల,తొట్టైనా అయ్యో నువ్వే ఊపాల
కట్టవయ్య నట్టింట ఉయ్యాల,తొట్టైనా అయ్యో నువ్వే ఊపాల
నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్దర పోతావా
అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా
ఊఊలల హాయి ఊఊలల హాయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: