Jan 10, 2009

పుట్టింటి పట్టుచీర

తారాగణం:సురేష్,యమున,చిన్నా,గొల్లపూడి మారుతీరావు
గాత్రం:బాలు,చిత్ర
దర్శకత్వం:బోయిన సుబ్బారావు
విడుదల:1990

పల్లవి:

కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కోటిపుణ్యాల తోట కోరి మరీ వచ్చిందంట
కొన్ని జన్మాలదాక మహారాణి నేనేనంట
పిడికిడంత గుండెల్లో ఈ పైడికొండ పట్టేదెట్టా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా

చరణం1:

సమస్త సుఖాలు తధాస్తు పలికిన ముహూర్తబలం ఇది
అనంత సుఖాలు సుధల్ని చిలికిన పవిత్రక్షణం ఇది
ఎడారి మనస్సులో వెలిసిన వసంతవనం ఇది
ప్రభాత సరస్సులో విరిసిన సువర్ణ సుమం ఇది
అగ్నిసాక్షి అనుబంధం వెయ్యేళ్ళ బాట చూపేనంట

కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా

చరణం2:

గులాబి నిషాల కుమారి కులుకుల చలాకితనం ఇది
కుహుకుహుమను కులాస కథలకు ఉగాది కదా ఇది
వయ్యారి వరూధిని వధువుగ వరించు వరం ఇది
సరాగ స్వరాలతో మధనుడి సుగంధశరం ఇది
పలకరించు పొంగుల్లో పన్నీటి తానమాడలంట

కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కోటిపుణ్యాల తోట కోరి మరీ వచ్చిందంట
కొన్ని జన్మాలదాక మహారాణి నేనేనంట
పిడికిడంత గుండెల్లో ఈ పైడికొండ పట్టేదెట్టా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: