తారాగణం: కృష్ణ,రతి,గీత
గాత్రం: బాలు,సుశీల బృందం
సంగీతం :రమేష్ నాయుడు
దర్శకత్వం :విజయనిర్మల
విడుదల: 1981
పల్లవి:
భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో
తెళ్ళారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో

చరణం1:
గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలొ

గుమ్మడంటె గుమ్మడు మాయదారి గుమ్మడు
కొప్పులో పూలెట్టి తుప్పర్లోకి లాగాడు
గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలొ
కుప్పంలో ఇల్లున్న అళ్ళున్నే కొప్పమ్మ
అత్తింటికెళదాము రమ్మంటే తపమ్మ
తప్పొప్పులిప్పుడే తలబోసుకుందామ
తలలంటుకున్నాక తలబోసుకుందామ
గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలొ
భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో
తెళ్ళారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
తెళ్ళారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
చరణం2:
హరిలో రంగ హరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరి హరిలో రంగ
హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరి హరిలో రంగ
హరికోసమైతే తపటులు హరి హరి
హరిదాసుకైతే కాసులు హరి హరి
దాసుని తప్పులు దండంతో సరి
హరిలో రంగ హరి హరిలో రంగ హరి
హరిలో రంగ హరి హరిలో రంగ
సరిలో రంగ సరి సరిలో రంగ సరి
సరిలో రంగ సరి సరిలో రంగ
దండం అంటే రెండర్ధాలు
చేతులు రెండూ కలిపేదొకటి,వాతలు నిండుగ వేసేదొకటి
చేతులు రెండూ కలిపేదొకటి,వాతలు నిండుగ వేసేదొకటి
సరిలో రంగ సరి సరిలో రంగ సరి
సరిలో రంగ సరి సరిలో రంగ సరా? సరా? సరా? సరా?
ఉం సరి సరి
హరిలో రంగ హరి
భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో
తెళ్ళారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
తెళ్ళారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
చరణం3:
బావల వీపులు తప్పెట్లోయ్,తాగినకొద్ది చప్పట్లోయ్

అవి మోగినకొద్ది ముచ్చట్లోయ్,ఒయ్ మోగినకొద్ది ముచ్చట్లోయ్
మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లోయ్,కొరికినకొద్ది దిబ్బట్లోయ్
ఓయ్ మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లోయ్,కొరికినకొద్ది దిబ్బట్లోయ్
అవి దొరికేదాకా ఇక్కట్లోయ్
దిబ్బట్లోయ్,బొబ్బట్లోయ్
భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో
తెళ్ళారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
తెళ్ళారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1 comment:
చాలా బాగుందండి.........
Post a Comment