గాత్రం: జిక్కి
పల్లవి:
ఏటి ఒడ్డున మావూరు
ఎవ్వరు లేరు మావారు
ఏరు దాటి మా ఊరికి వస్తే ఎనక్కి పోలేరు
ఇక ఎనక్కి పోలేరు
హొయ్ ఏటి ఒడ్డున మావూరు
ఎవ్వరు లేరు మావారు
ఏరు దాటి మా ఊరికి వస్తే ఎనక్కి పోలేరు
ఇక ఎనక్కి పోలేరు
చరణం1:
ముసిముసి నవ్వుల మురిపిస్తా
ముద్దుల వర్షం కురిపిస్తా
ముసిముసి నవ్వుల మురిపిస్తా
ముద్దుల వర్షం కురిపిస్తా
వన్నెల చిన్నెల మెరిపిస్తానురా
వస్తాదు మావా కుస్తీల మావా
నే వలపుల పంటలు పండిస్తానురా
హొయ్ ఏటి ఒడ్డున మావూరు
ఎవ్వరు లేరు మావారు
ఏరు దాటి మా ఊరికి వస్తే ఎనక్కి పోలేరు
ఇక ఎనక్కి పోలేరు
చరణం2:
ఎక్కడెక్కడో చూడకురా
ఈ చక్కని చుక్కను వీడకురా
ఎక్కడెక్కడో చూడకురా
ఈ చక్కని చుక్కను వీడకురా
ఎక్కడెక్కడో చూడకురా
ఈ చక్కని చుక్కను వీడకురా
రెక్కలు కట్టుకు రివ్వుల వాలితిరా
ఓ చక్కని మావా ఓ చిక్కని మవా
నీ టక్కరి చూపుల వల్లో చిక్కితిరా
హొయ్ ఏటి ఒడ్డున మావూరు
ఎవ్వరు లేరు మావారు
ఏరు దాటి మా ఊరికి వస్తే ఎనక్కి పోలేరు
ఇక ఎనక్కి పోలేరు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment