Feb 11, 2009

దేశద్రోహులు

తారాగణం : ఎన్.టి.రామారావు, దేవిక
గాత్రం: ఘంటసాల, సుశీల
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
దర్శకత్వం: బోళ్ళ సుబ్బారావు
విడుదల: 1964



పల్లవి:

జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం1:

మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే
మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట
ఇదే చేరెను గోరువంక రామ చిలుక చెంత అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింతా

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ

చరణం2:

విరజాజులా సువాసనా స్వాగతములు పలుక,సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి అనురాగాలా తేలి
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎవ్వరి కోసమో ఎందుకింత పరవశమో

జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

ramya said...

wow baavundi blog rupu rekalu marchesaare!