గాత్రం:జానకి
పల్లవి:
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
ఇంట్లోనే ఓ దీపమెట్టినరోజు
కంట్లోనే ఓ పాప పుట్టినరోజు
ఇక ఏకాంతమే లేదు ఏ జన్మకీ
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
చరణం1:
కోకిలపాటలతో ఆకలి తీరెనులే
లోకువచేసే లోకుల కాకుల కేకలు చెల్లవులే
వెన్నెల నవ్వులతో కన్నులు పండెనులే
నీటికి సోకిన ఎండల గుండెల రంగులు పొంగెనులే
శిలగానే పడివుంటే వినపడెను ఓ శిశువాణి సుఖపడగ గతప్రాణి
చిలిపిగ చిలకల కొలికి పలుక
ముంగిళ్ళే ముత్యాల ముగ్గులు వేసే
వాకిళ్ళే చిన్నారి వంతలు పాడే
ఇక నీతోడెమో నీడ ఈ అమ్మకి
లలలలా సంగీతమే సంతోషమే
చరణం2:
చుక్కల బుగ్గలకి చూపులు సోకవులే
అమ్మల అక్కల అందరి కళ్ళకు గంతలు పడ్డవిలే
కౌగిలి బిడ్డలకి కాకలు సోకవులే
గుప్పిట మూసిన గోళ్ళను కొంగల బారులు చూడవులే
పైటలేసి నిన్ను చూసి చిట్టి జడలే నీకు వేసి
చూసుకుంటా అమ్మరాశి కడుపారగ తల్లి నిన్నుగని
జాబిల్లే చుక్కల్లో ఎక్కము రాసే
మావిళ్ళే వేవిళ్ళ పిందెలు వేసే
ఇక నీ ఆటతో పాట నా నోటికి
లలలలా సంగీతమే సంతోషమే
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
ఇంట్లోనే ఓ దీపమెట్టినరోజు
కంట్లోనే ఓ పాప పుట్టినరోజు
ఇక ఏకాంతమే లేదు ఏ జన్మకీ
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment