గాత్రం: శ్రీకుమార్,బాలు,చిత్ర
సంగీతం :కీరవాణి
దర్శకత్వం :ప్రియదర్శన్
విడుదల:1994
పల్లవి:
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
చరణం1:
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల రేగాల
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేల
నల్లనల్ల ఎండల్లోన ఎల్లాకిల్లా పడ్డటున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటి జాబిలమ్మ అబ్బాయంటి సూర్యుడమ్మ ఇంటి దీపలవ్వాలంట దిక్కుల్లో
ఎవరికి వారే యమునకు తీరే
రేపుమీద మాపటంట మాపతోడు రేపుదంట పంచుకుంటే
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
చరణం2:
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల గుల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోళటాలాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో
పరవశమేదో ఓ ఓ ఓ
పరిమళమాయే ఏ ఏ ఏ ఓ
పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై
|
1 comment:
యేసుదాసు అయ్యుండకపోవచ్చు. అది ఎం. జి. శ్రీకుమార్ గాత్రం అనుకుంటున్నాను. సరిదిద్దగలరు.
Post a Comment