Jun 8, 2009

మల్లె మొగ్గలు

తారాగణం: రాజేష్,సాగరిక
గాత్రం: బాలు
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమేష్ నాయుడు
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: రామోజీ రావు
సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
విడుదల: 1986



పల్లవి:

ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు కాళింది ఊరు రేపల్లె
ఏరు కాళింది ఊరు రేపల్లె
వేణువందుకే మోగిందమ్మ
వెన్నదాచకే కన్నె గోపెమ్మ
వెన్న దాచకే కన్నె గోపెమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ

చరణం1:

మువ్వ గోపాలా రారా అంటూ
మువ్వ గోపాలా రారా అంటు
మువ్వ మువ్వకి పిలుపేనమ్మా
ముద్దు గోవిందా రారమ్మంటు
ముద్దు గోవిందా రారమ్మంటు
ముగ్గు ముగ్గున కవితేనమ్మా
జారు పైటలా జావళి వింటే
జాను తెనుగులే పండేనమ్మా
జాను తెనుగులే పండేనమ్మా
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ

చరణం2:

ఆఆఆఆఆఆ
సువ్వి గోపాలా సువ్వి అంటూ
సువ్వి గోపాలా సువ్వి అంటూ
పాలపొంగులే పలికేనమ్మ
గుమ్మడెక్కడే గుమ్మా అంటూ
చల్ల చిందులే సణిగేనమ్మ
కొమ్మ కొమ్మకీ కొత్త పల్లవి
కోకిలమ్మలే పాడేనమ్మ
కోకిలమ్మలే పాడేనమ్మ

ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు కాళింది ఊరు రేపల్లె
ఏరు కాళింది ఊరు రేపల్లె
వేణువందుకే మోగిందమ్మ
వెన్నదాచకే కన్నె గోపెమ్మ
వెన్న దాచకే కన్నె గోపెమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: