గాత్రం: సుశీల
సంగీతం: ఎస్.రాజేశ్వర రావు
దర్శకత్వం: బి.విఠలాచార్య
సంస్థ: రాజలక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల: 1962
పల్లవి:
తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
తెలియని చీకటి తొలగించి
వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు
చరణం1:
దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
పదుగిరిలోన పరువును పెంచి
పేరు తెచ్చే పెన్నిధి
తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
చరణం2:
అల్లరి చేయుట చెల్లనిది
ఎల్లకు వాడుక కూడనిది
అల్లరి చేయుట చెల్లనిది
ఎల్లకు వాడుక కూడనిది
ఏడువరాదు ఏమనరాదు
ధీరునివలెనే నిలవాలి
తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
చరణం3:
బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
ఉరుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులువలె తడబడునా
|
No comments:
Post a Comment