Jul 18, 2009

ప్రేమించు పెళ్ళాడు

గాత్రం : బాలు,జానకి




పల్లవి:

వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

చరణం1:

నిజము నా స్వప్నం హాహా కలనో హొహొ లేనో హొహొ హొ
నీవు నా సత్యం హొహొ అవునో హొహొ కానో హొహొ హొ
ఊహ నీవే హహహాహా ఉసురుకారాదా హహా
మోహమల్లే హహహాహా ముసురుకోరదా హహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వ గోపాలుని రాధికా
ఆకాశవీణా గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

చరణం2:

తాకితే తాపం హొహొ కమలం హొహొ భ్రమరం హొహొ హొ
తాగితే మైకం హొహొ అధరం హొహొ మధురం హొహొ హొ
పాట వెలదీ హాహహాహా ఆడుతూ రావే
తేట గీతీ హాహహాహా తేలిపోనీవే
పున్నాగ కొవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుకా
చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: