గాత్రం: ఘంటసాల,సుశీల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
పల్లవి:
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి నాచెంత నీకింత జాగేలనె
చెలి నాచెంత నీకింత జాగేలనె
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాలలూగింతులే
ఇక అందాల ఉయ్యాలలూగింతులే
చరణం1:
మధుర శృంగార మందారమాల
కదలి రావేల కలహంస లీల
మధుర శృంగార మందారమాల
కదలి రావేల కలహంస లీల
రంగు రంగుల బంగారు చిలక
రంగు రంగుల బంగారు చిలక
వలచి నీముందు వాలిందిలే
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి నాచెంత నీకింత జాగేలనె
చెలి నాచెంత నీకింత జాగేలనె
చరణం2:
చరణమంజీరనాదాలలోన కరగిపోనిమ్ము గంధర్వబాల
చరణమంజీరనాదాలలోన కరగిపోనిమ్ము గంధర్వబాల
సడలిపోవని సంకెళ్ళు వేసి
సడలిపోవని సంకెళ్ళు వేసి సరసరాగాల తేలింతులే
కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాలలూగింతులే
ఇక అందాల ఉయ్యాలలూగింతులే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment