గాత్రం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల: 2009
Happy Birthday Chitra
పల్లవి:
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవనీ
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కొవెలనౌతా నువ్వే నెలవు తీరెలా
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనీ
చరణం1:
వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మధిని వెధించే శ్యామసుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనీ
చరణం2:
ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాపగలిగిన కైలశమా
కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంత వెలిగించి హారతియ్యనా
నిన్నే నిన్నే నిన్నే ఓ ఓ ఓ
నిన్నే నిన్నే నిన్నే
~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment