Aug 2, 2009

స్నేహబంధం

తారాగణం: కృష్ణ,జమున
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: సత్యం
దర్శకత్వం: పి.సి.రెడ్డి
సంస్థ: విజయ & సురేష్ కంబైన్స్
విడుదల: 1973



Happy Frienship Day



పల్లవి:

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము
స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము
ఆ అహహ హహహా హ ఆ
లా లాలా లలలాలలల

చరణం1:

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు వాడిపోదు కష్టసుఖాల్లో

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

చరణం2:

మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయువచ్చును
మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయువచ్చును
పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
చెక్కుచెదరంది స్నేహమని నమ్మవచ్చును

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము
ఆ అహహ హహహా హ ఆ
లా లాలా లలలాలలల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: