Aug 4, 2009

మురారి

గాత్రం: బాలు,అనురాధాశ్రీరాం
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హత్తుకోవాలి
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు

చరణం1:

ఎంచక్కా నీ నడుమెక్కి ఆ సగమై ఉంటా సరదాగా
వాటంగా చెయి వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
వద్దన్నా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా
గారంగా మమకారంగా నిను చుట్టేస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

చరణం2:

అబ్బోసి సొగసొచ్చేసి మహ చెలరేగావే లైనేసి
నను చూసి తెగ సిగ్గేసి తలవంచేసా మనసిచ్చేసి
చుట్టేసి పొగపెట్టేసి నను లాగేసావే ముగ్గేసి
ఒట్టేసి జతకట్టేసి వగలిస్తానయ్యో వలిచేసి
ఓసొసి మహ ముద్దేసి మతి చెడగొట్టావే రాకాసి
హే అడ్డేసి పొగమందేసి నను కాపాడయ్యో దయచేసి

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
హొయ్ హొయ్ హొయ్ అరె భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హొయ్ హొయ్ హత్తుకోవాలి హాయ్ హాయ్
సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ డాడ్డడు డండడా అమ్మడు
బావా బావా పనీరు అయిపోతావా అల్లుడు
భామ భామ డాడ్డడ డండడారడండడాడండడా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: