Aug 22, 2009

వీరాభిమన్యు

తారాగణం :రామారావు,శోభన్ బాబు,కాంచన,గీతాంజలి,కాంతారావు
గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
దర్శకత్వం :వి. మధుసూదన రావు
నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, డూండీ
సంస్థ: రాజ్యలక్ష్మి ప్రొడక్సన్స్
విడుదల:1965



పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అదిగో నవలోకం వెలసే మన కోసం
అహహాహాహా ఓహొహొహొ
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం

చరణం1:

నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచట మనముందామా ఆఆఆఆ
అదిగో నవలోకం వెలసే మనకోసం

చరణం2:

పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచట మనముందామా ఆఆఆఆ
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: