Aug 25, 2009

అరుంధతి

గాత్రం: సందీప్,శ్రీకృష్ణ,ఖుషి మురళి,నాగ సాహితి,రేణుక
సాహిత్యం: అనంత్‌శ్రీరాం



పల్లవి:

చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కల్లే ముత్యాలల్లి మెళ్ళో వేసావే
డోలారే డోలారే డం
కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే డం
ఇళ్ళంతా బృందావనం
పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దుమికే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామ తొంగి మనం
డోలారే డోలారే డం
కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే డం
ఇళ్ళంతా బృందావనం
ఇళ్ళంతా బృందావనం

చరణం1:

ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మావిడి ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్లో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా
వరించి తరించే వాడే వస్తున్నాడు అడ్డం లెగండోయ్
హే డోలారే డోలారే డం
వారేవా ఎం సోయగం
డోలారే డోలారే డం
నువ్వేగా నాలో సగం
డోలారే డోలారే డం


కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలె లేదా
శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద

జేజమ్మా జేజమ్మా
జేజమ్మా జేజమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా

చరణం2:

నాచోరే నాచోరే ఓ సోనియే
నువ్వే పుట్టావే మేరే లియే
నాకంటి పాపల్లే చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే
మనసే బంగారం అంటారోయ్ అంతా
ఇహ పో నీ పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట
కలలోనైనా నిను విడిపోదంట
ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడండోయ్

డోలారే డోలారే డం
నాచుట్టు ఈ సంబరం
డోలారే డోలారే డం
ఏజన్మదో ఈ వరం
ప్రాణంలో నే దాచుకుంటాను పంచేటి ఆ ప్రాయము
జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము

డోలారే డోలారే డం
ఇళ్ళంతా బృందావనం
ఇళ్ళంతా బృందావనం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: