తారాగణం: రాజశేఖర్,సుహాసిని
గాత్రం: బాలు,జానకి
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంస్థ: కృష్ణ చిత్ర
విడుదల: 1989
పల్లవి:
మల్లెలతో ఆడుకొనే మనసుండాలి అమ్మాయి
వెన్నెలతో కిన్నెరలా పాడుకో హాయిగా ప్రతిరేయి
మల్లెలతో ఆడుకొనే మనసుంటే సరిపోదోయి
ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి
చరణం1:
నీ కళ్ళలోనే కౌగిళ్ళలోనే నే నీతో ఉండాలని హా
ఆ గుండెలోనె నీరెండలోనే నీడల్లే ఆడాలని
ఓ మావిళ్ళ పూతే వేవిళ్ళ వలపై
దాగుళ్ళు ఆడే లోగిళ్ళలోన
గుడిగుడిగుంచం గుండెరాగం పాడాలని
మల్లెలతో ఆడుకొనే మనసుండాలి అమ్మాయి
ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి
చరణం2:
కేరింతలాడే గోరంతదీపం నా ఇంట వెలగాలని
కవ్వింతలాడే అందాల రూపం నట్టింట తిరగాలని
హొ చిన్నారులాడే చిరునవ్వులన్ని
అందాలు విరిసే హరివిల్లే అయితే
ఆ హరివిల్లే మన పొదరిల్లై ఉండాలని
మల్లెలతో ఆడుకొనే మనసుంటే సరిపోదోయి
ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి
మల్లెలతో ఆడుకొనే మనసుండాలి అమ్మాయి
వెన్నెలతో కిన్నెరలా పాడుకో హాయిగా ప్రతిరేయి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment