Sep 8, 2009

ఆపద్భాందవుడు

తారాగణం: చిరంజీవి,మీనాక్షి శేషాద్రి,జంధ్యాల
గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
సంస్థ: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
విడుదల: 1992



పల్లవి:

ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాల..ఊహు
ఆ ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా
అంత వింత గాధల్లో
అమ్మలాల పైడికొమ్మలాల ఏడి ఏమైయాడో జాడలేడియ్యల ఓసి తందనాలా ఆనందలాల
గొగుల్లాల పిల్ల గోగుల్లాల గొళ్ళ భామల్లాల ఏడనుందియ్యాల నాటి నందనాల ఆనందలీల
ఆ ఆ ఆ ఆ ఆ
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికి
అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికి
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా

చరణం1:

నల్లరాతి కండలతో ఒహొహొ హొయ్ కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో ఒహొహొ హొయ్ కరుణించుతోడె
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల

చరణం2:

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలుపట్టే ఆనందలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమ్మెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: