Sep 22, 2009

అమ్మలేని పుట్టిల్లు

గాత్రం: జేసుదాసు




పల్లవి:

చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా
నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా
పసిదానివే అని చూడక
వసివాడని నీ బ్రతుకున
విధియే విషమే చిలికే
చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా
నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా

చరణం1:

ఆరిపోనిదమ్మ నీ కన్నీటి శోకం
భారతాన స్త్రీ జాతికి భర్తయే సర్వం
నూరేళ్ళు ఉండేదంటారే మాంగళ్యం
ముడినే తెంచేవేసారే ఏం ఘోరం
స్వర్గతుల్యమైనదే నీ సంసారం
శోకసంద్రమైనదే నీ ప్రాయం
బ్రతుకే మోడై మిగిలే ఏ ఏ ఏ

చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా
నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా

చరణం2:

మానిపోనిదమ్మ నీ ఎదలోని గాయం
రాలిపోయెనమ్మ నీ సిగలోని కుసుమం
పడతికి బొట్టు కాటుకలే ఆధారం
మెడకొక ఉచ్చును పోలినదే వైధవ్యం
గాజులతొ కన్న కలల మోజులే పోయే
గాజుకళ్ళ జీవితమె తెల్లబోయే
తోడే నీకే కరువై

చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా
నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా
పసిదానివే అని చూడక
వసివాడని నీ బ్రతుకున
విధియే విషమే చిలికే
చెదిరిన నీ కుంకుమలే తిరిగిరానివా
నిత్యసౌభాగ్యాలే చెరిగిపోయెనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: