Sep 27, 2009

లవకుశ

గాత్రం:ఘంటసాల,పి.లీల,పి.సుశీల




జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం

పల్లవి:

జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే

ఉప పల్లవి:

జనకుని మాటల తలపై నిలిపి
తన సుఖముల విడి వనితామణితో
వనములకేగిన ధర్మావతారుడు
జగదభి రాముడు శ్రీరాముడే

చరణం1:

కరమున ధనువు శరములు దాలిచి
కరమున ధనువు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కరమున ధనువు శరములు దాలిచి
ఇరువది చేతుల దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధివీరుడు
జగదభి రాముడు శ్రీరాముడే

చరణం2:

ఆలుమగల అనురాగాలకు
ఆలుమగల అనురాగాలకు
పోలిక సీతారాములే యనగ
పోలిక సీతారాములే యనగ
వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు
జగదభి రాముడు శ్రీరాముడే

చరణం3:

నిరతము ధర్మము నెరపి నిలిపి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిరతము ధర్మము నెరపి నిలిపి
నరులకు సురలకు తరతరాలకు
వరవడియైన వరయుగ పురుషుడు
జగదభి రాముడు శ్రీరాముడే

చరణం4:

ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని
ఇనకులమణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని
జనులు భజించే పురుషోత్తముడు
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకులసోముడు ఆ రాముడే
జగదభి రాముడు శ్రీరాముడే

జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం
జయజయరాం జయరఘురాం


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

మొదటి రెండు పాదాలు ’పల్లవి’ లో భాగం కాదు. దానిని ’సాకీ’ అంటారు.
తరువాతి నాలుగు పాదాలు - ’పల్లవి’.
తరువాత వచ్చే నాలుగు పాదాలు ఒకటవ చరణం కాదు. అది ’ఉపపల్లవి’.
ఆ ఉపపల్లవిలో రెండవ పాదంలో ’వనితావనితో’ అని వ్రాసారు. అది ’వనితామణితో’ అని ఉండాలి.
మంచి గీతాలను పాఠకులు/ శ్రోతలకు పరిచయం చేస్తూ, మన సంస్కృతికి విశిష్టమైన సేవ చేస్తున్నారు.
అభినందనలు !

విహారి(KBL) said...

ధన్యవాదాలు ఫణీంద్రగారు