Nov 28, 2009

తలంబ్రాలు

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: మల్లెమాల

పల్లవి:

నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
తోడుగా నాతో ఉండిపో

నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
నీడలా నాతో ఉండిపో

చరణం1:

నీలల నింగి ఒంగి నేల చెవిలో ఇలా అంది
నీలల నింగి ఒంగి నేల చెవిలో ఇలా అంది
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నది
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నది హొయ్
సరిలేని సుద్దుల్లో విడిపోని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ

నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
నీడలా నాతో ఉండిపో

చరణం2:

గోదారి కెరటంలోన గోరంత సొగసే ఉంది
హొయ్ గోదారి కెరటంలోన గోరంత సొగసే ఉంది
నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ
కార్తీక పున్నమిలోన కాసింత హాయే ఉంది
కార్తీక పున్నమిలోన కాసింత హాయే ఉంది
ఏ వేళనైన నీ నీడలోన ఎనలేని హాయున్నదీ
కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్

నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం
కంటిలో పాపలా
తేనెలో తీపిలా
నీడలా నాతో ఉండిపో
నిన్న నీవు నాకెంతో దూరం...దూరం దూరం దూరం
నీవే నాకు ఈనాడు ప్రాణం...ప్రాణం ప్రాణం ప్రాణం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: