Jan 3, 2010

మంగమ్మ శపధం

తారాగణం: రామారావు,జమున,ఎల్.విజయలక్ష్మి
గాత్రం: సుశీల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: టి.వి.రాజు
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
సంస్థ: డి.వి.ఎస్.ప్రొడక్షన్స్
విడుదల: 1965




పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ హొయ్
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది
పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగె రెపరెపలాడే యవ్వనమేమన్నది
పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగె

చరణం1:

పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెత్రాచువోలె వయసు కుబుసం విడుతున్నది
పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెత్రాచువోలె వయసు కుబుసం విడుతున్నది
సొగసైన బిగువైన నాదే నాదే

రివ్వున సాగె రెపరెపలాడే యవ్వనమేమన్నది
పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగె

చరణం2:

నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
ఓ ఓ ఓ ఒహొహొ ఓ ఓ ఓ ఒహొ హొహొ ఒహొ హొహొ ఓ ఓ
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
జగమంతా అగుపించెద నేనే నేనే

రివ్వున సాగె రెపరెపలాడే యవ్వనమేమన్నది
పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగె

చరణం3:

నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నేనన్నది కాలేనిది ఏదీ ఏదీ

రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది
పదే పదే సవ్వడి చేయుచున్నది ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: