సాహిత్యం: ఆత్రేయ
పల్లవి:
పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా
కృష్ణా పదుగురెదుట పాడనా
పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా
చరణం1:
పొదలమాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణుగానము
పొదలమాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణుగానము
పొలత పోసిన రాగసుధకు మొలకలెత్తిన లలితగీతి
పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా
చరణం2:
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
మెత్తలేరే విత్తమీ హృదయాల పొంగిన మధురగీతి
పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా
చరణం3:
ఎవరులేని యమునాతటిని ఎక్కడో ఏకాంతమందున
ఎవరూలేని యమునాతటిని ఎక్కడో ఏకాంతమందున
నేను నీవై నీవు నేనై ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నేను నీవై నీవు నేనై పరవశించే ప్రణయగీతి
పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా
కృష్ణా పదుగురెదుట పాడనా
|
1 comment:
మంచి పాట.
Post a Comment