తారాగణం: కృష్ణంరాజు,శారద,జయసుధ
గాత్రం:యేసుదాసు,వాణీ జయరాం
సంగీతం :జె.వి.రాఘవులు
దర్శకత్వం: వి.మధుసూదనరావు
విడుదల:1979
పల్లవి:
గీతా ఓ గీతా
డాళింగ్ మై డాళింగ్
మనసార నీతో మాటాడుకోనీ
మనసార నీతో మాటాడుకోనీ
రాజా ఓ రాజా
డాళింగ్ మై డాళింగ్
మనసార నీతో మాటాడుకోనీ
మనసార నీతో మాటాడుకోనీ
చరణం1:
పరదేశంలో ఆవేశంతో ప్రేమించిన మనకనుమతి బహుమతి
ఈ దేశంలో సంతోషంతో మనువాడినచో అనుబంధం ఆనందం
వెచ్చని వలపుల ముచ్చట తీరును
అనురాగ బంధం ముడివేసుకోనీ
అనురాగ బంధం ముడివేసుకోనీ
రాజా ఓ రాజా
డాళింగ్ మై డాళింగ్
మనసార నీతో మాటాడుకోనీ
మనసార నీతో మాటాడుకోనీ
చరణం2:
చిరునవ్వులతో పులకింతలతో వికసించిన ఒక మధువనం యవ్వనం
ఈ భంగిమలో ఈ పొంగులతో మురిపించే బిగి కౌగిలి గిలిగిలి
ఊహలే రేగితే మోహమే ఆగునా ఆ ఆ
ఒడిలోన నన్ను ఒదిగొదిగి పోనీ
ఒడిలోన నన్ను ఒదిగొదిగి పోనీ
గీతా ఓ గీతా
డాళింగ్ మై డాళింగ్
ఒడిలోన నన్ను ఒదిగొదిగి పోనీ
ఒడిలోన నన్ను ఒదిగొదిగి పోనీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment