గాత్రం: ఘంటసాల,పి.సుశీల
పల్లవి:
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
చరణం1:
చెట్టాపట్టగ కాలం గీలం నెట్టుకునే రానా
చెట్టుతీగలవలెనే నిన్ను చుట్టుకునే పోనా ఆ ఆ
చెట్టాపట్టగ కాలం గీలం నెట్టుకునే రానా
చెట్టుతీగలవలెనే నిన్ను చుట్టుకునే పోనా
గిలిలేని కౌగిలిలోన చలికి చెలికి చెరవెయ్‌నా
కలలూరే కన్నులలోన తొలిచూపుతొ బందీచెయ్‌నా
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
చరణం2:
పొద్దే తెలియని ముద్దు ముచ్చట నీలో వింటున్నా
హద్దే చూడని ఆవేశాలు నీలో కంటున్నా
పొద్దే తెలియని ముద్దు ముచ్చట నీలో వింటున్నా
హద్దే చూడని ఆవేశాలు నీలో కంటున్నా
వేగం ఉన్నది నాలోన బిగువులు ఉన్నవి నీలోన
ఒదిగి ఒదిగి నీ ఎదలోన నేనొడిపోదు నీఒ డిలోన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
చరణం3:
పొంగే పొంగుకు కట్టలువేసి నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే నేను ఊర్కున్నా
పొంగే పొంగుకు కట్టలువేసి నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే నేను ఊర్కున్నా
మనసు కుదురుగా ఉంటున్నా సొగసూరించెను పంతాన
పంతాలెందుకు మనలోన నీ సొంతం కానని అన్నానా
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారు తందానతాన
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment