Mar 8, 2010

ఆడదే ఆధారం

తారాగణం: విసు,చంద్రమోహన్,సీత
గాత్రం: బాలు
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: శంకర్ గణేష్
దర్శకత్వం: విసు
సంస్థ: లక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల: 1988




పల్లవి:

మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు

చరణం1:

ఆశపుడితే తీరుదాకా ఆగరు ఎలనాగలు
సహనానికి నేలతల్లిని పోలగలరు పొలతులు
అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు
అత్తగా అవతరిస్తే వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు

మహిళలు మహరాణులు
మహిళలూ మహరాణులు

చరణం2:

విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు
ఒడ్డుదాటే ఉప్పెనల్లే ముప్పుకారా ముదితలు
పెద్దలను మన్నించే పద్దతే వద్దంటే
మానము మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణకొద్ది కాపాడే రెప్పలే
కత్తులై పొడిచేస్తే ఆపేదింకెవరులే
వంగివున్న కొమ్మలే బంగారు బొమ్మలు

మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: