గాత్రం: భానుమతి
సంగీతం: భానుమతి
నిర్మాత & దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
సంస్థ: భరణీ పిక్చర్స్
విడుదల: 1954
పల్లవి:
ఉయ్యాలజంపాలలూగరావయ్య
ఉయ్యాలజంపాలలూగరావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాలజంపాలలూగరావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాలజంపాలలూగరావయ్య
చరణం1:
తాతయ్య సిరులెల్లా వేగ రప్పింప
జాబులో పుట్టిన బాబు నీవయ్య
జాబులో పుట్టిన బాబు నీవయ్య
ఉయ్యాలజంపాలలూగరావయ్య
చరణం2:
మా మనోరమక్కాయి మదిలోన మెరిసి
ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి
ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి
ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి
నా వారసుడావంతు నవ్వూరా కలసి
నా వారసుడావంతు నవ్వూరా కలసి
ఉయ్యాలజంపాలలూగరావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాలజంపాలలూగరావయ్య
చరణం3:
మా మదిలో కోర్కెలను మన్నింప దయతో
అవతరించినావయ్య అందాలరాశి
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష
తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష
తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష
ఉయ్యాలజంపాలలూగరావయ్య
తులలేని భోగాల తూగి
ఉయ్యాలజంపాలలూగరావయ్య
ఊగరావయ్య ఊగరావయ్య
|
No comments:
Post a Comment