గాత్రం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
సాహిత్యం: ఆరుద్ర
పల్లవి:
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు
చరణం1:
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
సొంతవూరు అయినవారు అంతరాన ఉందురోయ్
అంతరాన ఉందురోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు
చరణం2:
తెంచుకొన్న కొలది పెరుగు తీయని అనుబంధం
తెంచుకొన్న కొలది పెరుగు తీయని అనుబంధం
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలె అతుకునోయ్
జ్ఞాపకాలె అతుకునోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు
చరణం3:
కనులనీరు చిందితే మనసు తేలికౌనులే
కనులనీరు చిందితే మనసు తేలికౌనులే
తనకూ తనవారికీ ఎడబాటే లేదులే
ఎడబాటే లేదులే
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment