తారాగణం: కమల్‌హాసన్,శ్రీదేవి
గాత్రం: బాలు, జానకి
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: భారతీరాజా
నిర్మాత: బి.సీతారామయ్య
సంస్థ: కె.ఎస్.ఆర్.క్రియేషన్స్
విడుదల: 1979
పల్లవి:
ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది
చరణం1:
లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతము
న న న న న నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న న న నా
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది
చరణం2:
పెదవిని ఈ మధువునూ నేడే చవిచూడనా
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా
వయసుని వయసే దోచేది
న న న న న న అది మనసుని నేడే జరిగేది
న న న న న న న న న న న న న నా
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment