Dec 31, 2010
ఇల్లాలు
గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆత్రేయ
పల్లవి:
మనసునేదో కవ్విస్తుంది
తలచుకుంటే నవ్వొస్తుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది
తలచుకుంటే నవ్వొస్తుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది
చరణం1:
ఆ ఆ ఆ ఆ
ఒడిని ఉన్నా విడిచి ఉన్నా నిదురరానేరానంటుంది
ఒడిని ఉన్నా విడిచి ఉన్నా నిదురరానేరానంటుంది
నిదురరాని హృదయమేమో కథలు చెబుతానంటుంది
కథలు చెబుతానంటుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది
చరణం2:
కన్నె మనసు ఏం చేస్తుంది
కలవరింత మొదలెడుతుంది
విరులపానుపు విసుగౌతుంది
వెన్నెలైనా వేడౌతుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది
చరణం3:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మొదటిరేయి నన్ను చేరి బుగ్గ మీద ముగ్గువేసే
మొదటిరేయి నన్ను చేరి బుగ్గ మీద ముగ్గువేసే
నిన్ను చూసి నేను కరిగి ఒదిగిపోవుట గురుతు వచ్చె
ఒదిగిపోవుట గురుతు వచ్చె
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment